39 కొవిడ్‌ నోటిఫైడ్‌ ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1.54 కోట్ల పెనాల్టీ

ABN , First Publish Date - 2021-05-16T06:34:53+05:30 IST

కొవిడ్‌ చికిత్స కోసం 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ పథకాల కింద నగదు రహిత చికిత్సకు కేటాయించకపోవడం, నిర్దేశించిన ఫీజులకు మించి వసూలు చేయడం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటం వంటి కారణాలతో 39 కొవిడ్‌ నోటిఫైడ్‌ ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1.54 కోట్ల పెనాల్టీ విధిస్తూ కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

39 కొవిడ్‌ నోటిఫైడ్‌ ప్రైవేటు ఆసుపత్రులకు   రూ.1.54 కోట్ల పెనాల్టీ

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 15: కొవిడ్‌ చికిత్స కోసం 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ పథకాల కింద నగదు రహిత చికిత్సకు కేటాయించకపోవడం, నిర్దేశించిన ఫీజులకు మించి వసూలు చేయడం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటం వంటి కారణాలతో 39 కొవిడ్‌ నోటిఫైడ్‌ ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1.54 కోట్ల పెనాల్టీ విధిస్తూ కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లతో కలిసి కొవిడ్‌ నోటిఫైడ్‌ ఆసుపత్రుల యాజమాన్యాలతో జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా ఆసుపత్రులకు రూ.2 లక్షల నుంచి రూ.10ు లక్షల వరకు మొత్తం పెనాల్టీ విధించామన్నారు. ఈ మొత్తాలను 48 గంటల్లోపు ఆరోగ్యశ్రీ అకౌంట్‌కు చెల్లించాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనకు ప్రథమ తప్పిదంగా పెనాల్టీ విధించామని, మళ్లీ తప్పిదాలకు పాల్పడితే ఆయా ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సిబ్బందితో నిర్వహిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్‌, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి.రాజకుమారి, సబ్‌ కలెక్టర్లు, ఆర్టీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, నోడల్‌ అధికారులు, వైద్యాధికారులు, నోటిఫైడ్‌ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-16T06:34:53+05:30 IST