గూగుల్‌ ఫొటోలకు 3డి ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-12-18T05:30:00+05:30 IST

గూగుల్‌ ఫొటోలు ఇకపై మరింత కళను సంతరించుకోనున్నాయి. మెషీన్‌ లెర్నింగ్‌ సహాయంతో 3డి ఎఫెక్ట్‌ కలిగిస్తోంది. సినిమాటిక్‌ ఫొటోస్‌ పేరిట సరికొత్త ఫీచర్‌ను గూగల్‌ పరిచయం చేసింది. తద్వారా కొన్ని ఫొటోలకు 3డి ఎఫెక్ట్‌ కల్పిస్తోంది.

గూగుల్‌ ఫొటోలకు 3డి ఎఫెక్ట్‌

గూగుల్‌ ఫొటోలు ఇకపై మరింత కళను సంతరించుకోనున్నాయి. మెషీన్‌ లెర్నింగ్‌ సహాయంతో 3డి ఎఫెక్ట్‌ కలిగిస్తోంది. సినిమాటిక్‌ ఫొటోస్‌ పేరిట సరికొత్త ఫీచర్‌ను గూగల్‌ పరిచయం చేసింది. తద్వారా కొన్ని ఫొటోలకు 3డి ఎఫెక్ట్‌ కల్పిస్తోంది. గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ లభ్యమవుతోంది. దీన్ని వినియోగదారులు అప్‌డేట్‌ చేసుకుంటే కొత్త సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. మెమరీస్‌ సెక్షన్‌లో కొత్త థీమ్‌లను పరిచయం చేయబోతోంది. మీ జీవితంలోకి వచ్చిన ముఖ్యమైన వ్యక్తులు అంటూ సంబంధిత షాట్‌లను చూడవచ్చు. సాధారణంగా ఇవి వినియోగదారుల కార్యకలాపాలు అంటే బేకింగ్‌ లేదంటే సూర్యాస్తమయం వంటి వాటిని చూపిస్తుంది. ఫొటో ఒరిజినల్‌లో క్లిక్‌ కానప్పటికీ వర్చ్యువల్‌ కెమెరా సహాయంతో యానిమేషన్‌ జరిగి, ఫొటోకు మంచి ఎఫెక్ట్‌ వస్తుంది. 

Updated Date - 2020-12-18T05:30:00+05:30 IST