Abn logo
Sep 22 2021 @ 15:50PM

బెదిరింపులకు గురి చేసినందుకు 4గురి అరెస్టు

ఠానే: ఒక వ్యక్తిని బెదిరించారనే ఆరోపణలతో పోలీసులు నలుగురిని అరెస్టు చేసిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు సెప్టెంబరు 15న దివ పట్టణంలో విధులు ముగించుకుని ఆటో రిక్షాలో ఇంటికి తిరిగి వస్తున్నారు. రెండు మోటర్ సైకిల్‌లపై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనకు తుపాకీని గురిపెట్టారు. అనంతరం చంపేస్తామని బెదిరించారు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆయన వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఇద్దరు యువకులను సెప్టెంబరు 18న అరెస్టు చేశారు. ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి  సేకరించిన సమాచారం మేరకు ఈ ఘటన వెనుక 31ఏళ్ల హోటలీయర్, సెలూన్‌ను నడిపే వ్యక్తి ఉన్నట్టు బయటపడింది. 


పోలీసులు నిందితులను ప్రశ్నించగా..బాధితుడి భార్యను పెళ్లికి ముందు హోటలీయర్ ప్రేమించాడు. ఆ ప్రేమ విఫలం అయింది. అందువల్ల  ఉద్దేశపూర్వకంగానే ఇద్దరిని విడదీయాలనుకున్నాడు. మరో ఇద్దరు వ్యక్తుల నుంచి సహాయాన్ని తీసుకున్నట్టు వెల్లడించాడు. నిందితుల నుంచి ఒక రివాల్వర్, మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption