Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 1 2021 @ 20:57PM

పాట్నా బాంబు పేలుళ్ల కేసులో నలుగురికి ఉరి, ఇద్దరికి యావజ్జీవం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాట్నా గాంధీ మైదాన్ పేలుళ్ల కేసులో దోషులుగా నిర్ధారించిన తొమ్మిది మందికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారంనాడు శిక్షలు ఖరారు చేసింది. దోషుల్లో నలుగురికి ఉరిశిక్ష ప్రకటించింది. ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల జైలు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2013లో జరిగిన ఈ వరుస పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులోని 10 మంది నిందితుల్లో తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారిస్తూ ఎన్ఐఏ కోర్టు గత అక్టోబర్ 27న తీర్పు వెలువరించింది. శిక్షలను మాత్రం సోమవారంనాడు ఖరారు చేసింది.

ప్రధాని మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ పాల్గొన్న'హుంకార్' ర్యాలీ సందర్భంగా ఈ వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. సభాస్థలి చుట్టుపక్కల ఆరు పేలుళ్లు సంభవించాయి. రెండు బాంబులు సభావేదికకు 150 మీటర్ల దూరంలో పేలాయి. అయితే, ర్యాలీలో తొక్కిసలాట జరక్కుండా నివారించేందుకు మోదీ తన ప్రసంగం కొనసాగించారు. సభాస్థలి సమీపంలో నాలుగు లైవ్ బాంబులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement