చెప్పులు వేసుకుంటే రూ. 4 లక్షల జీతం

ABN , First Publish Date - 2021-01-18T07:20:04+05:30 IST

ఖాళీగా ఏం చేయకుండా.. కేవలం ఇంట్లో కూర్చుని ఏడాదికి రూ. 4లక్షలు సంపాదిస్తే? బాగుంటుంది కానీ అలాంటి ఉద్యోగం ఎవరిస్తారులెండి అంటారా..? యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ‘బెడ్‌రూం అథ్లెటిక్స్‌’ అనే సంస్థ ఇలాంటి అవకాశాన్నే కల్పిస్తోంది. ఆ సంస్థకు చెందిన పాదరక్షల్ని

చెప్పులు వేసుకుంటే రూ. 4 లక్షల జీతం

యూకే సంస్థ వినూత్న ఆఫర్‌


న్యూఢిల్లీ, జనవరి 17: ఖాళీగా ఏం చేయకుండా.. కేవలం ఇంట్లో కూర్చుని ఏడాదికి రూ. 4లక్షలు సంపాదిస్తే? బాగుంటుంది కానీ అలాంటి ఉద్యోగం ఎవరిస్తారులెండి అంటారా..? యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ‘బెడ్‌రూం అథ్లెటిక్స్‌’ అనే సంస్థ ఇలాంటి అవకాశాన్నే కల్పిస్తోంది. ఆ సంస్థకు చెందిన పాదరక్షల్ని రోజుకు 12గంటల పాటు ధరిస్తే చాలు.. ఏడాదికి సుమారు రూ. 4 లక్షల వరకూ జీతాన్ని అందిస్తామని తాజాగా ప్రకటించింది. ఈ మేరకు తమ వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగం చేసేవారు చేయాల్సిందల్లా.. సంస్థ పాదరక్షల్ని రోజుకు 12గంటల పాటు ధరించి, వారికి సమీక్ష చెప్పడమే. పనితీరు బాగుంటే జీతంతో పాటు 12జతల చెప్పుల్ని కూడా ఉచితంగా ఇస్తారండోయ్‌! అయితే వచ్చిన చిక్కల్లా.. రెండు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ ఒకటి పురుషుడికి, ఒకటి మహిళకు ఇస్తారు.

Updated Date - 2021-01-18T07:20:04+05:30 IST