కొవిడ్-19: 40 లక్షల మంది ఉద్యోగుల జీతాల్లో కోత

ABN , First Publish Date - 2020-07-03T00:21:40+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో కనీసం 40 లక్షల మంది ప్రైవేటు

కొవిడ్-19: 40 లక్షల మంది ఉద్యోగుల జీతాల్లో కోత

వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో కనీసం 40 లక్షల మంది ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కోత పడినట్టు ఆర్థికవేత్తల లెక్కలు చెబుతున్నాయి. గత ఆర్థిక మాంద్యం కంటే కూడా కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లి పనిచేసే వారిపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతూ పోతోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మరోపక్క కరోనా కారణంగా అమెరికాలో అరవై లక్షల మందికి పైగా బలవంతంగా పార్ట్ టైం చేయాల్సి వస్తోంది. తాము ఫుల్ టైం చేయాలనుకుంటున్నప్పటికి తమ యజమానులు కేవలం పార్ట్ టైం మాత్రమే చేయమంటున్నారని అనేక మంది ఉద్యోగులు ఆవేదన వెల్లగక్కుతున్నారు. చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు అనే తేడా లేకుండా అమెరికాలో ప్రతిఒక్క కంపెనీ కూడా ఉద్యోగుల జీతాల్లో కోతను విధిస్తోంది. ఒకపక్క లక్షలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటే.. మరోపక్క ఉద్యోగాలు చేసే వారి జీతాల్లో సగానికి పైగా కోతలు పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఉద్యోగాలు కాపాడేందుకే తమ ఉద్యోగుల జీతాల్లో 5 నుంచి 50 శాతం వరకు కోతలు పెడుతున్నట్టు కంపెనీలు చెబుతున్నా

Updated Date - 2020-07-03T00:21:40+05:30 IST