Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 26 2021 @ 17:55PM

బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడిలో నలుగురు పాక్ జవాన్ల మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ లక్ష్యంగా బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు దాడిలో నలుగురు పాక్ జవాన్లు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. డాన్ దినపత్రిక కథనం ప్రకారం.. హర్నాయ్ జిల్లాలోని ఖోషత్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సీ)తో ఉన్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్న బీఎల్ఏ బాంబు దాడికి పాల్పడింది.


ఎఫ్‌సీ జవాన్లతో నిండి ఉన్న వాహనం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగిన ప్రదేశంలోనే నలుగు జవాన్లు మృత్యవాత పడగా మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, శుక్రవారం ఇదే ప్రావిన్స్‌లోని అవారన్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు భద్రతాధికారులు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బలోచిస్థాన్‌లో పాకిస్థాన్ పాలనను వ్యతిరేకిస్తున్న బీఎల్‌ఏ ఏళ్లుగా పోరాడుతోంది. 2019లో బీఎల్ఏను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement