Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఊహించని ఘటనతో నివ్వెరపోయిన భారత సంతతి వ్యాపారి.. మూడు వారాల తర్వాత..

ఎన్నారై డెస్క్: దక్షిణాఫ్రికాలో వ్యాపారం చేసుకుంటూ అక్కడే కుటుంబ సభ్యులతో సంతోషంగా నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి.. ఊహించని ఘటనతో ఒక్కసారిగా షాకయ్యాడు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులందరూ భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మూడు వారాల తర్వాత .. ప్రస్తుతం ఆ వ్యాపారి కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


భారత సంతతికి చెందిన నాజిమ్ మోతీకి దక్షిణాఫ్రికాలో పలు వ్యాపారాలన్నాయి. ఆ వ్యాపారాలు చూసుకుంటూ ఆయన తన కుటంబ సభ్యులతో అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే వారికి నలుగురు పిల్లలు జన్మించారు. కాగా.. ఎప్పటిలాగే అక్టోబర్ 21 నాజిమ్ నలుగురు పిల్లలూ కారులో స్కూల్‌కు వెళ్తుండగా.. కొందరు దుండగులు వారి కారును అడ్డగించారు. అనంతరం పిల్లలను కిడ్నాప్ చేశారు. దీంతో విషయం తెలిసి నాజిమ్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై నాజిమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అధికారులు రంగంలోకి దిగారు. 


పిల్లల కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతుండగానే.. ఆ దుండగులు వారిని బుధవారం విడిచిపెట్టారు. దీంతో దాదాపు మూడు వారాల తర్వాత నాజిమ్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలు ఇంటికి చేరుకున్నారన్న సమాచారం తెలియడంతో పోలీసులు నాజిమ్ ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అధికారులు.. పిల్లల ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైందన్నారు. ఇదిలా ఉంటే.. పిల్లలను విడిపించుకోవడం కోసం నాజిమ్.. ఆ దుండగులు డిమాండ్ చేసిన డబ్బును చెల్లించారా లేదా అనే విషయంపై సమాచారం లేదు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement