నవ్వుతున్న ఆ నాలుగేళ్ల చిన్నారిని చూసి కన్నీరు కార్చిన పోలీసు డిటెక్టివ్‌లు! అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-04T02:41:18+05:30 IST

ఆస్ట్రేలియాలో ఇటీవల సంచలనం సృష్టించిన నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ ఉదంతానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఏకంగా 18 రోజుల పాటు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన అక్కడి అధికారులు ఎట్టకేలకు ఆమెను గుర్తించారు.

నవ్వుతున్న ఆ నాలుగేళ్ల చిన్నారిని చూసి కన్నీరు కార్చిన పోలీసు డిటెక్టివ్‌లు! అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో ఇటీవల సంచలనం సృష్టించిన నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ ఉదంతానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఏకంగా 18 రోజుల పాటు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన అక్కడి అధికారులు ఎట్టకేలకు ఆమెను గుర్తించారు. ఆమె సురక్షితంగా ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నారు. బాలికకు ఏమై ఉంటుందో తెలీక ఇంతకాలం ఆందోళనతో గడిపిన పోలీసులకు బాలికను చూసిన ఆనందంలో కన్నీళ్లు ఆగలేదు. తన తల్లిదండ్రులతో పాటూ క్యాంపింగ్‌కు వెళ్లిన క్లియో స్మిత్ అనే బాలిక గత నెలలో కిడ్నాప్ అయింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని తీర ప్రాంతమైన కార్నావాన్‌లో ఈ ఘటన జరిగింది. అయితే..నిందితుడికి కిడ్నాప్ చేయాలన్న ఆలోచన మొదట్లో లేదని, నేరం చేసేందుకు అవకాశం ఉన్నట్టు కనిపించడంతోనే అతడు బాలికను అపహరించాడని పోలీసులు పేర్కొన్నారు. 


సరిగ్గా నెల రోజుల క్రితం.. ఉదయాన్నే తన టెంట్‌లో నిద్ర లేచిన తల్లికి క్లియో కనిపించలేదు. దీంతో.. ఆమె గాబరా పడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 18 రోజుల పాటు పాప ఎక్కడుందో తెలియక ఆమె తల్లిదండ్రులు ఖంగారు పడిపోయారు. అయితే.. పోలీసుల ప్రయత్నాలు ఫలించి పాప ఆచూకీ లభించింది.ఆమె క్షేమంగా ఉందని తెలిసి ఆస్ట్రేలియా దేశ ప్రజలందరూ సంబరపడిపోయారు. 


Updated Date - 2021-11-04T02:41:18+05:30 IST