హైదరాబాద్‌ మెడ్‌పార్క్‌లో 40 కంపెనీలు

ABN , First Publish Date - 2021-02-24T08:19:22+05:30 IST

దేశీయంగా వైద్య పరికరాల (మెడికల్‌ డివైసెస్‌) ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం..పీఎల్‌ఐ స్కీమ్‌ను ప్రకటించింది...

హైదరాబాద్‌ మెడ్‌పార్క్‌లో 40 కంపెనీలు

  • రూ.1,200 కోట్ల పెట్టుబడులు.. 6,500 మందికి ఉద్యోగాలు
  • త్వరలోనే మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ పార్కుల కేటాయింపు  
  • 4 పార్కులకు 16 రాష్ట్రాల నుంచి దరఖాస్తులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయంగా వైద్య పరికరాల (మెడికల్‌ డివైసెస్‌) ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం..పీఎల్‌ఐ స్కీమ్‌ను ప్రకటించింది. దీంతోపాటు నాలుగు మెడికల్‌ డివైసెస్‌ పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. కొవిడ్‌ అనంతరం మెడికల్‌ టెక్నాలజీ రంగంపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టిందని, మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటే దేశీయంగా అవసరమైన మెడికల్‌ డివైసె్‌సను ఇక్కడే ఉత్పత్తి చేయడమే కాక.. ఎగుమతి చేయగల సత్తా భారత్‌కు ఉందని ఆ పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా మెడికల్‌ డివైసెస్‌ తయారీ ప్రాధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుగా గుర్తించటమే కాకుండా పార్కును అభివృద్ధి చేస్తోందని బయో ఏషియా సదస్సులో తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తెలిపారు. 


4 వారాల్లో మెడ్‌ట్రానిక్స్‌ పరిశోధన కేంద్రం

హైదరాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైసెస్‌ పార్కును 250 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు జయేశ్‌ రంజన్‌ తెలిపారు. గత మూడేళ్లలో పార్కులో కార్యకలాపాలు ప్రారంభించడానికి 40 కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. ఈ కంపెనీలు రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 6,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ఆయన తెలిపారు. కాగా హైదరాబాద్‌లో రూ.1,200 కోట్లతో నెలకొల్పుతున్న మెడ్‌ట్రానిక్స్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రానికి వచ్చే నెల రోజుల్లో శ్రీకారంచుట్టనున్నట్లు సంస్థ ఇండియా ఎండీ మదన్‌ ఆర్‌ కృష్ణన్‌ తెలిపారు. 


5శాతం ప్రోత్సాహకాలు..

దేశీయంగా మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ తయారీకి పీఎల్‌ఐ పథకం ద్వారా ప్రతి ఏడాది పెరిగే విక్రయాలపై ప్రభుత్వం 5ు ప్రోత్సాహకాలను ఇవ్వనుందని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ జాయింట్‌ డ్రగ్స్‌ కంట్రోలర్‌ ఎస్‌ ఈశ్వర్‌ రెడ్డి తెలిపారు. పీఎల్‌ఐ కార్యక్రమంతో పాటు దేశం లో నాలుగు మెడికల్‌ డివైసెస్‌ పార్కులను ఏర్పాటు చేయనుందని తెలిపారు. 4 పార్కుల కోసం 16 రాష్ట్రాలు దరఖాస్తులు చేశాయని, దరఖాస్తుల పరిశీలన జరుగుతుంతోందని రెడ్డి తెలిపారు. త్వరలోనే పార్కులను కేటాయించిన రాష్ట్రాల పేర్లను ప్రకటించనున్నట్లు చెప్పారు. కాగా కొన్ని మెడికల్‌ డివైసెస్‌ ధరలు అసాధారణంగా ఉన్నాయి. దాన్ని నియంత్రించడానికే మెడికల్‌ డివైసె్‌సపై ధరల నియంత్రణను ప్రభుత్వం పరిశీలిస్తోందని, లాభదాయకతకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఈశ్వర్‌ రెడ్డి అన్నారు.  


Updated Date - 2021-02-24T08:19:22+05:30 IST