లారస్‌ ల్యాబ్స్‌ లాభంలో 40% వృద్ధి

ABN , First Publish Date - 2021-07-30T05:53:58+05:30 IST

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన లారస్‌ ల్యాబ్స్‌ రూ.241

లారస్‌ ల్యాబ్స్‌ లాభంలో 40% వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స): జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన లారస్‌ ల్యాబ్స్‌ రూ.241 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.172 కోట్లతో పోలిస్తే 40 శాతం పెరిగింది. ఇదే కాలానికి ఆదాయం కూడా 31 శాతం వృద్ధితో రూ.974 కోట్ల నుంచి రూ.1,279 కోట్లకు చేరినట్లు లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ సత్యనారాయణ చావా తెలిపారు. లారస్‌ బయో నుంచి ఆదాయం రావడం ప్రారంభమైందని, రెండో త్రైమాసికంలో ఇది మరింత పెరుగుతుందని చెప్పారు.


తొలి త్రైమాసికంలో పరిశోధన, అభివృద్ధిపై కంపెనీ రూ.49 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం అమ్మకాల్లో ఇది 3.8 శాతం. ప్రస్తుతమున్న ఖాతాదారులతో పాటు కొత్త ఖాతాదారుల నుంచి వ్యాపారం రావడంతో సింథసిస్‌  విభాగం 95 శాతం వృద్ధి నమోదుచేసింది.


Updated Date - 2021-07-30T05:53:58+05:30 IST