ఏడాది చివరకు 40% మంది ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు!

ABN , First Publish Date - 2021-10-13T06:27:13+05:30 IST

ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 40 శాతం మంది మళ్లీ కార్యాలయాలకు వచ్చే వీలుందని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌ భరణి అరోల్‌ అన్నారు.

ఏడాది చివరకు 40% మంది ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు!

22న హైసియా ఇన్‌ఫ్రా సదస్సు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 40 శాతం మంది మళ్లీ కార్యాలయాలకు వచ్చే వీలుందని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌ భరణి అరోల్‌ అన్నారు. ఈ నెల 22న నిర్వహించనున్న హైసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  సదస్సు వివరాలను వెల్లడించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ... చాలా మంది ఉద్యోగులు కార్యాలయాలకు రావటానికి ఇష్టపడుతున్నారని తెలిపారు. కాగా హైసియా ఇన్‌ఫ్రా సదస్సును నిర్వహించడం ఇది రెండోసారి. స్మార్ట్‌ ట్రాన్‌పోర్ట్‌, వర్క్‌ ప్లేస్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, సస్టయినబుల్‌ సవాళ్లు మొదలైన అంశాలపై 20 మందికి పైగా నిపుణులు మాట్లాడనున్నారు. 


అనిశ్చిత పరిస్థితులున్నాయ్‌: వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నా.. ఇప్పటికీ అనిశ్చితి పరిస్థితులు ఉన్నాయని హైసి యా ఇన్‌ఫ్రా ఫోరమ్‌ అధిపతి,  స్టేట్‌ స్ట్రీట్‌ ఎండీ రమేశ్‌ కాజా అన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటివి చిన్న ఐటీ కంపెనీలు భరించలేనందున చిన్న కంపెనీల్లో 70-80 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికే కార్యాలయాలకు వస్తున్నారని చెప్పారు. పెద్ద కంపెనీల్లో ఆయా కంపెనీల విధానాలు, సౌలభ్యం మొదలైన వాటికి అనుగుణంగా కొన్ని కంపెనీల్లో ఇప్పటికీ 5 శాతం కంటే తక్కువ మందే కార్యాలయాలకు వస్తున్నారని చెప్పారు. 

Updated Date - 2021-10-13T06:27:13+05:30 IST