యాన్యుటీకి 40% నిర్బంధం కాదు

ABN , First Publish Date - 2021-04-17T06:38:43+05:30 IST

పదవీ విరమణ సమయంలో నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) ఖాతాలో ఉన్న మొత్తంలో 40 శాతం నిధులతో యాన్యుటీ కొన డం ఇక ఐచ్ఛికం కానుంది

యాన్యుటీకి 40%  నిర్బంధం కాదు

పీఎఫ్‌ఆర్‌డీఏ వెల్లడి 


న్యూఢిల్లీ: పదవీ విరమణ  సమయంలో నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) ఖాతాలో ఉన్న మొత్తంలో 40 శాతం నిధులతో యాన్యుటీ కొన డం ఇక ఐచ్ఛికం కానుంది. ఇప్పటివరకు 40 శాతం నిధులతో యాన్యుటీ కొనుగోలు తప్పనిసరి. మిగతా 60 శాతం సొమ్ము మాత్రమే ఎన్‌పీఎస్‌ ఖాతాదారులు ఏకమొత్తంలో తీసుకునే అవకాశం ఉంది. అయితే ఖాతాలోని నిధులపై తక్కువ రాబడులు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఖాతాదారులకు ప్రతికూల రాబడులు వస్తున్నందున 40 శాతం నిర్బంధ యాన్యుటీ కొనుగోలు నిబంధన తొలగించాలని నిర్ణయించినట్టు పీఎ్‌ఫఆర్‌డీఏ చైర్మన్‌ సుప్రతీమ్‌ బందోపాధ్యాయ తెలిపారు. ఆ నిర్ణయం ప్రకారం ఇక నుంచి ఖాతాలో రూ.5 లక్షల వరకు నిధులున్న వారు మొత్తం సొమ్మును తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. 


కాగా ఖాతాలో రూ.5 లక్షలకు పైబడి నిధులున్న ఖాతాదారులు 40 శాతం మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేయడం లేదా క్రమానుగత ఉపసంహరణ ప్రణాళిక (ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా కొన్ని సంవత్సరాల కాలపరిమితిలో నిధులు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పిస్తూ పీఎ్‌ఫఆర్‌డీఏ చట్టం-2013కి త్వర లో సవరణలు ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-04-17T06:38:43+05:30 IST