Advertisement
Advertisement
Abn logo
Advertisement

14 ఏళ్ల బాలుడితో 40 ఏళ్ల మహిళ.. ఇరు కుటుంబాల మధ్య గొడవ.. గ్రామస్తులు దానిని ఎలా పరిష్కరించారంటే..

ప్రేమకోసం కొందరు అన్ని బంధాలు తెంచుకొని వెళ్లిపోతారు. అలాంటి వారికి ప్రేమ తప్ప మరేమి కనబడదు. వారికి బంధాలు, బాధ్యతలు కనపడవు. అలాంటి ఒక ప్రేమికుల విచత్రమైన జంట తన ఇంటి వారిని కాదని చెప్పపెట్టకుండా వెళ్లిపోయింది. ఆ తరువాత వారిద్దరి కుటుంబ సభ్యులు ఒకరిపైఒకరు నిందులు వేస్తూ గొడవకు దిగారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని దహోడ్ జిల్లాలో జరిగింది.


గుజరాత్‌లోని దహోడ్ జిల్లా సమీపంలోని అమ్లిఖేడాకు చెందిన మీరాబేన్(40, పేరు మార్చబడినది) తన భర్తతో కలిసి కూలి పని చేసుకొనేది. వారిద్దరికీ ఆరుగురు పిల్లలు ఉన్నారు. మీరాబేన్ పని చేసేచోట బబ్లూ(14, పేరు మార్చబడినది) కూడా పనిచేసేవాడు.  బబ్లూని మీరాబేన్ ఇష్టపడేది. అతడిని ప్రేమించేది. ఒకరోజు తన భర్త, పిల్లలను వదిలి బబ్లూతో ఆమె వెళ్లిపోయింది. దీంతో మీరాబేన్ భర్త బబ్లూ తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. బబ్లూ తన భార్యను మాయమాటలు చెప్పి లేపుకుపోయాడని అతడు వాదించాడు. ఆ తరువాత బబ్లూ తల్లిదండ్రులు, మీరాబేన్ భర్త గ్రామ పెద్దల మధ్య పంచాయితీకి వెళ్లారు. ఆ గ్రామంలో ఇటువంటి గొడవలకు పరిష్కారం కింద పరిహారం చెల్లించమని అడుగుతారు. కానీ ఈ కేసులో ఎవరు బాధితులో గ్రామస్తులు తేల్చలేకపోయారు. 

దీంతో బబ్లూ తండ్రి తన కుమారుడు ఒక మైనర్ కావడంతో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బబ్లూ పుట్టిన తేదిని ధృవీకరించే బర్ సర్టిఫికేట్(birth certificate) చూసి మీరాబేన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement