చిన్నారులపై 400% పెరిగిన సైబర్ నేరాలు

ABN , First Publish Date - 2021-11-15T02:01:03+05:30 IST

మొత్తం 2020 సంవత్సరంలో 842 సైబర్ నేరాలు నమోదు కాగా, ఇందులో 738 కేసులు పిల్లలపై లైంగికంగా అసభ్యకరమైన చర్యలని తెలిపారు. చిన్నారులపై ఇంత పెద్ద మొత్తంలో కేసులు పెరగడానికి లాక్‌డౌన్ కూడా ఒక కారణమని కొందరు అంటున్నారు...

చిన్నారులపై 400% పెరిగిన సైబర్ నేరాలు

న్యూఢిల్లీ: జాతీయ బాలల దినోత్సవం రోజున నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో చెప్పిన వివరాలు భయానకంగా ఉన్నాయి. 2019 ఏడాదితో పోలిస్తే 2020 ఏడాదిలో చిన్నారుపై జరుగుతున్న సైబర్ నేరాలు 400 శాతం పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. కాగా ఈ కేసులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నాయని, ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.


మొత్తం 2020 సంవత్సరంలో 842 సైబర్ నేరాలు నమోదు కాగా, ఇందులో 738 కేసులు పిల్లలపై లైంగికంగా అసభ్యకరమైన చర్యలని తెలిపారు. చిన్నారులపై ఇంత పెద్ద మొత్తంలో కేసులు పెరగడానికి లాక్‌డౌన్ కూడా ఒక కారణమని కొందరు అంటున్నారు. 2019లో చిన్నారులపై 164 సైబర్ నేరాలు జరిగినట్లు నమోదు అయ్యాయి. ఒకే ఏడాదిలో ఈ సంఖ్య 842కు పెరిగింది.


ఉత్తరప్రదేశ్‌లో అతి ఎక్కువగా 170 కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో 144, మహారాష్ట్రలో 137, ఒడిశాలో 71 నమోదు అయినట్లు నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో పేర్కొంది.

Updated Date - 2021-11-15T02:01:03+05:30 IST