రాణికెట్‌ వ్యాధితో 4వేల నాటుకోళ్లు మృతి

ABN , First Publish Date - 2021-03-03T08:42:10+05:30 IST

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలకేంద్రంలో రాణికెట్‌ వ్యాధితో నాలుగువేల నాటుకోళ్లు మంగళవారం మృతి చెందాయి.

రాణికెట్‌ వ్యాధితో 4వేల నాటుకోళ్లు మృతి

కాల్వశ్రీరాంపూర్‌, మార్చి 2: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలకేంద్రంలో రాణికెట్‌ వ్యాధితో నాలుగువేల నాటుకోళ్లు మంగళవారం మృతి చెందాయి. ఉదయం కోళ్ల ఫారంకు వెళ్లి చూస్తే పెద్దమొత్తంలో మృతి చెంది కనిపించాయని, రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు స్వామి వివరించారు. రాణికెట్‌ వ్యాధి సోకడం వల్లనే కోళ్లు మృతి చెందాయని పశు వైద్యుడు సురేశ్‌ తెలిపారు. వ్యాధి సోకిన కోళ్లు కునికి పాట్లు తీస్తాయని, వాటి రెక్కలు నేల వాలతాయని వివరించారు. కోళ్లకు వ్యాక్సిన్‌  వేయాలని సూచించానని తెలిపారు. మృతి చెందిన కోళ్లను గుంత తవ్వి అందులో పాతి పెట్టారు. ఇదిలా ఉండగా మండలంలోని కూనారంలోనూ దొంకెన మొగిలికి చెందిన నాటు కోళ్లఫాంలో ఇటీవల పెద్దఎత్తున  కోళ్లు మృతి చెందాయి.

Updated Date - 2021-03-03T08:42:10+05:30 IST