400వ రోజూ సమర సంగ్రామాలు

ABN , First Publish Date - 2021-01-21T06:07:54+05:30 IST

400వ రోజూ సమర సంగ్రామాలు

400వ రోజూ సమర సంగ్రామాలు

అటు అలుపెరగని ఉద్యమ పోరాటం.. ఇటు అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆరాటం..

అటు అహర్నిశలు మోగుతున్న నినాదాలు.. ఇటు అదిమిపట్టాలని ప్రభుత్వ పెద్దల పన్నాగాలు..

అటు అమ్మలాంటి అమరావతి కోసం దీక్షలు.. ఇటు అడుగడుగునా కాలదన్నే కుట్రలు..

ఎన్నో అవాంతరాలు.. మరెన్నో అడ్డగింపుల నడుమ బుధవారం 400వ రోజులోకి అడుగుపెట్టింది అమరావతి ఉద్యమం. లాఠీలు విరుగుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. అందరి లక్ష్యం ఒకటే. అందరి గమ్యం అమరావతే. ఇంతింతై.. అన్నట్టు అణచివేస్తున్న కొద్దీ అణ్వాయుధాలుగా మారుతూ.. ప్రతి ఒక్కరూ పోరాటయోధులై ముందుకు కదులుతున్నారు. ఒకరితో మొదలై.. పదులై.. వందలై.. వేలు దాటిన ఈ మహోద్యమం బుధవారం కూడా మరింత బిగిసింది. రైతులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు రోడ్డెక్కి సమరశంఖాన్ని పూరించారు. అమరావతి గ్రామాలు సంగ్రామాన్ని తలపించాయి. 

























Updated Date - 2021-01-21T06:07:54+05:30 IST