Abn logo
Oct 27 2021 @ 01:38AM

రైతులకు రూ.4.17 కోట్ల చెక్కు పంపిణీ

రైతులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌ తదితరులు

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 26: రైతన్నల లోగిళ్లలోకి దీపావళి కాంతులు ముందే వచ్చాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు. మంగళవారం వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, యంత్ర సేవా పథకాల కింద రైతన్నల ఖాతాల్లోకి రూ.4.17 కోట్లను జమ చేస్తూ.. మెగా చెక్కును పంపిణీ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తాడేపల్లె క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రామచంద్రారెడ్డి, జేసీ రాజాబాబు, అధికారులు పాల్గొన్నారు.