పీఎం కేర్స్‌కు రూ.431 కోట్లు

ABN , First Publish Date - 2020-04-06T06:06:04+05:30 IST

కోవిడ్‌-19 బారిన పడిన వారికి సహాయం అందించే నిమిత్తం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ నిధికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలు రూ.430.63 కోట్ల విరాళం...

పీఎం కేర్స్‌కు రూ.431 కోట్లు

  • ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకుల విరాళం 


న్యూఢిల్లీ: కోవిడ్‌-19 బారిన పడిన వారికి సహాయం అందించే నిమిత్తం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ నిధికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలు రూ.430.63 కోట్ల విరాళం అందజేశాయి. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) అత్యధికం గా రూ.105 కోట్లు, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ రూ.100 కోట్లు, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐఐఎ్‌ఫఎల్‌) రూ.25 కోట్లు, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ రూ.22.81 కోట్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల అడ్మినిస్ర్టేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.7 లక్షలు, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు అధికారులు రూ.23 కోట్లు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ అధికారులు రూ.2 కోట్ల మొత్తాన్ని పీఎం కేర్స్‌ నిధికి అందించారు.   

Updated Date - 2020-04-06T06:06:04+05:30 IST