440 కేసులు.. ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2021-06-14T05:27:12+05:30 IST

440 కేసులు.. ముగ్గురు మృతి

440 కేసులు.. ముగ్గురు మృతి
పటమట రైతుబజారులో వినియోగదారుల రద్దీ

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కరోనా బారిన పడిన మరో ముగ్గురు పాజిటివ్‌ బాధితులు ఆదివారం మరణించారు. గడిచిన 24 గంటల్లో 6,421 మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించగా, 440 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 55, విజయవాడ గ్రామీణ డివిజన్‌లో 90, నూజివీడు డివిజన్‌లో 156, మచిలీపట్నం డివిజన్‌లో 95, గుడివాడ డివిజన్‌లో 43 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో కొవిడ్‌ మరణాల సంఖ్య అధికారికంగా 1,032కు పెరిగింది. మొత్తం పాజిటివ్‌ కేసులు 95,643కు చేరుకున్నాయి. వీరిలో ఇప్పటి వరకు 87,395 మంది వ్యాధి నుంచి కోలుకోగా, ప్రస్తుతం 7,216 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-06-14T05:27:12+05:30 IST