కువైట్‌లో కొవిడ్ టీకా కోసం 44వేల రిజిస్ట్రేషన్స్ !

ABN , First Publish Date - 2020-12-20T17:46:54+05:30 IST

అమెరికన్ సంస్థ ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌కు గల్ఫ్ దేశం కువైట్ ఇటీవల అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్ననల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

కువైట్‌లో కొవిడ్ టీకా కోసం 44వేల రిజిస్ట్రేషన్స్ !

కువైట్ సిటీ: అమెరికన్ సంస్థ ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌కు గల్ఫ్ దేశం కువైట్ ఇటీవల అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్ననల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభించింది. దీంతో ఇప్పటివరకు 44వేలకు పైగా మంది టీకా కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు జబేర్ ఆసుపత్రిలోని కొవిడ్-19 వ్యాక్సిన్ కమిటీ చీఫ్ డా. ముండి అల్ హసవి వెల్లడించారు. దీనికోసం తొమ్మిది రోజు కింద ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా పౌరులు, నివాసితులు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. 


ఈ ముందస్తు నమోదు ప్రక్రియ వల్ల ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రజల ప్రాధాన్యత విభాగాలను, టీకా డోసుల పరిమాణం, పంపిణీని గుర్తించడంలో సహాయపడే డేటా అందుతుందని ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్ సనాద్ పేర్కొన్నారు. ఇక డిసెంబర్ చివరి నాటికి కువైట్‌కు ఫైజర్ వ్యాక్సిన్ అందనుంది. వ్యాక్సిన్ అందిన వెంటనే రోజుకీ సుమారు 10వేల మందికి టీకా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కొవిడ్-19 వ్యాక్సినేషన్ కమిటీ సభ్యుడు డా. ఖలీద్ అల్ సయీద్ వెల్లడించారు. అలాగే ఫ్రంట్‌లైన్ కార్మికులు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

Updated Date - 2020-12-20T17:46:54+05:30 IST