‘వివో’ వి21 5జి 44ఎంపి సెల్ఫీ కెమెరా

ABN , First Publish Date - 2021-05-01T05:30:00+05:30 IST

ఇండియన్‌ మార్కెట్‌లోకి ‘వివో వి21 5జి’ని ‘వివో’ విడుదల చేసింది. ఇదో మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో 44ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది.

‘వివో’ వి21 5జి 44ఎంపి సెల్ఫీ కెమెరా

ఇండియన్‌ మార్కెట్‌లోకి ‘వివో వి21 5జి’ని ‘వివో’ విడుదల చేసింది. ఇదో మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో 44ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరా 4కె వీడియోలను రికార్డ్‌ చేస్తుంది. నైట్‌ పోర్ట్రయిట్‌, సూపర్‌ నైట్‌ సెల్ఫీ ఫీచర్లు ఉన్నాయి. మీడియా టెక్‌ ప్రాసెసర్‌ పవర్‌ కలిగి ఉంది. ఫుల్‌ హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే, ట్రిపుల్‌ ఏరియా కెమెరా దీని సొంతం.


ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకదాన్లో 8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కెపాసిటీ ఉంది. మరో దాన్లో  8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అంటే మొదటి దానికి  రెండింతలు ఉంది. వీటి రేట్లు వరుసగా రూ.29,990, రూ.32,990గా నిర్ణయించారు. మే 6 నుంచి అమ్మకాలు ఆరంభమవుతాయి. ఆర్కటిక్‌ వైట్‌, డస్క్‌ బ్లూ, సన్‌సెట్‌ డేజల్‌ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యమవుతాయి.

Updated Date - 2021-05-01T05:30:00+05:30 IST