Abn logo
Nov 22 2020 @ 13:08PM

కలెక్షన్‌ కింగ్‌ ..45 ఏళ్ల సినీ ప్రయాణం

Kaakateeya

కలెక్షన్‌ కింగ్‌ డా.మంచు మోహన్‌బాబు.. తెలుగు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి. సినీ రంగ ప్రయాణంలో నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హీరో ఇలా 560కి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. డైలాగ్స్‌ చెప్పడంలో మోహన్‌బాబు రూటే సెపరేటు అని ప్రేక్షకులతో మెప్పును పొందారీయన. నిర్మాతగా మారి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి 50కిపైగా సినిమాలు చేసి అభిరుచి గల నిర్మాతగానూ రాణించారు. శ్రీవిద్యానికేతన్‌ విద్యా సంస్థను స్థాపించి విద్యావేత్తగానూ సమర్ధవంతమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. నేటితో సినీ రంగంలోకి ఆయన అడుగు పెట్టి 45 సంవత్సరాలు పూర్తయ్యింది. ఇంకా ఆయన సినీ రంగానికి తన సేవలను అందిస్తున్నారు. రీసెంట్‌గా ఆయన కీలక పాత్రలో నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరో వైపు ఆయన టైటిల్‌ పాత్రలో సన్నాఫ్‌ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ లెజెండ్రీ యాక్టర్‌కి సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందనలు తెలిపారు. మోహన్‌బాబు తనయుడు, హీరో, నిర్మాత మంచు విష్ణు తన తండ్రి 45 ఏళ్ల సినీ ప్రయాణం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ ఓ వీడియో విడుదల చేశారు. 



Advertisement
Advertisement