జిల్లాలో రూ.4.50 కోట్లతో చేపపిల్లలు : జడ్పీ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2021-10-23T04:45:28+05:30 IST

మెదక్‌ జిల్లాలో ఈ ఏడాది రూ.4.50 కోట్లతో 5.33 కోట్ల చేపపిల్లలను చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో వదలుతున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

జిల్లాలో రూ.4.50 కోట్లతో చేపపిల్లలు : జడ్పీ చైర్‌పర్సన్‌
గౌతోజిగూడెం చెరువులో చేపపిల్లలను వదులుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత

తూప్రాన్‌ (మనోహరాబాద్‌)/తూప్రాన్‌ రూరల్‌, అక్టోబరు 22 : మెదక్‌ జిల్లాలో ఈ ఏడాది రూ.4.50 కోట్లతో 5.33 కోట్ల చేపపిల్లలను చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో వదలుతున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం మనోహరాబాద్‌ మండలం గౌతోజిగూడెం పరికిబండ, తుపాకులపల్లిలోని చెరువుల్లో ఆమె 1.50 లక్షల చేపపిల్లలను వదిలారు. అనంతరం గౌతోజిగూడెంలో రైతుల పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్‌ కార్పొరేషన్‌ సహాయ సంచాలకుడు మల్లేశం, ఎంపీపీ పురం నవనీతరవి, ఫాక్స్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచులు అర్జున్‌, వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, ఉపసర్పంచ్‌ రేణుకుమార్‌, డీఎల్‌పీవో వరలక్ష్మి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే తూప్రాన్‌ మండలంలోని ఘనపూర్‌, యావాపూర్‌ చెరువుల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి 4 లక్షల చేపపిల్లలను వదిలి మాట్లాడారు. చేపల పెంపకాలపై ఆధారపడ్డ కులాలవారికి ప్రభుత్వం వందశాతం సబ్సిడీపైన చేపపిల్లలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్‌ ఏడీ మల్లేశం, ఎంపీపీ గడ్డి స్వప్న, పాక్స్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, యావాపూర్‌, ఘనపూర్‌ సర్పంచులు నర్సింహారెడ్డి, పుష్పనవీన్‌, తూప్రాన్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, కృష్ణారెడ్డి, మన్నె శ్రీనివాస్‌, ఘనపూర్‌ ఉపసర్పంచ్‌ ఆకుల రవి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T04:45:28+05:30 IST