Abn logo
Sep 24 2021 @ 00:58AM

గడ్డెన్న ప్రాజెక్టు నుంచి 4,500 క్యూసెక్కుల నీటివిడుదల

ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పోటెత్తిన వరదనీరు

భైంసా, సెప్టెంబరు 23 : ప్రాజెక్టు ఎగువభాగంలోని మహారాష్ట్రలో కురుస్తు న్న భారీవర్షం మూలంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి వరద నీటి చేరిక ప్రారం భం అయింది. దీంతో గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టు నిర్వహ ణ అధికారులు ఒక వరదగేటును ఎత్తివేసి సుద్దవాగులోకి 45వందల క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7మీటర్లు ఉండగా వరద నీటి చేరికతో గురువారం సాయంత్రం ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. దీంతో పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ఇన్‌ఫ్లోకు అనుగుణంగా ఔట్‌ఫ్లోను కొనసాగించే చర్యలను చేపట్టారు.