భార్య ప్రియుడిని చంపి రైల్వే ట్రాకుపై పడేసిన భర్త.. రైల్లోంచి కింద పడి చనిపోయాడు అని అంతా నమ్మేశారు.. కానీ ఒకే ఒక్క డౌట్‌తో..

ABN , First Publish Date - 2021-12-04T22:12:20+05:30 IST

నలభై ఐదేళ్ల వయసున్న ఓ వ్యక్తి శవం రైల్వే ట్రాకుపై కనిపించింది. అయితే అందరూ అతడు రైల్లోంచి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడని అనుకున్నారు. కానీ అసలు జరిగిందేంటంటే

భార్య ప్రియుడిని చంపి రైల్వే ట్రాకుపై పడేసిన భర్త.. రైల్లోంచి కింద పడి చనిపోయాడు అని అంతా నమ్మేశారు.. కానీ ఒకే ఒక్క డౌట్‌తో..

భోపాల్: నలభై ఐదేళ్ల వయసున్న ఓ వ్యక్తి శవం రైల్వే ట్రాకుపై కనిపించింది. అయితే అందరూ అతడు రైల్లోంచి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడని అనుకున్నారు. కానీ అసలు జరిగిందేంటంటే భార్య ప్రియుడితో చనువుగా ఉండడం సహించలేని భర్త అతడిని హత్య చేశాడు. అయితే పోలీసులకు వచ్చిన ఒకే ఒక్క డౌట్‌తో అతడు దొరికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకెళ్తే..


శాంఘర్‌కు చెందిన 45 ఏళ్ల బనేసింగ్ తన కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఈ నెల ఒకటో తేదీన ఉదయం హన్స్‌పూరా గ్రామ సమీపంలోని రైల్వేట్రాకుపై బనేసింగ్ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. బాధితుడి తలపై, ఇతర శరీర భాగాలపై గాయాలను గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా బనేసింగ్‌ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. 


విచారణ ప్రారంభించిన పోలీసులకు హూకంసింగ్ భార్యతో బనేసింగ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. అయితే హత్య తర్వాత హూకంసింగ్‌తో పాటు అతడికి సహకరించిన మరో నలుగురు వ్యక్తులు కూడా కనిపించకుండా పోయారు. పోలీసులకు వచ్చిన ఈ ఒక్క డౌట్‌తో నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బనేసింగ్ తన భార్యతో పెట్టుకున్న వివాహేతర సంబంధం గురించి తెలిసి హూకంసింగ్‌ చాలా రోజుల నుంచి కోపంతో రగిలిపోయాడు. సమయం కోసం వేచిచూస్తున్న హూకంసింగ్ గురువారం రాత్రి తండ్రి, సోదరుడి సహాయంతో బనేసింగ్‌ని పొడిచి హత్య చేశారు. అనంతరం శవాన్ని రైల్వేట్రాకుపై పడేసి పారిపోయారు. అయితే 2017లోనే బాధితుడిపై శాంఘర్ పోలీస్ స్టేషన్లో హూకంసింగ్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో అతడు జైలుకెళ్లి ఇటీవలే తిరిగివచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 


Updated Date - 2021-12-04T22:12:20+05:30 IST