జిల్లావ్యాప్తంగా రెవెన్యూ స్పందనలో 4600 అర్జీలు

ABN , First Publish Date - 2021-10-22T05:07:53+05:30 IST

జిల్లాలో భూసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన రెవెన్యూ స్పందన గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అర్జీలను స్వీకరించారు. కొన్ని ప్రాంతాల్లోని సచివాలయాల్లో అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు పెద్దగా రాకపోగా కొన్నిప్రాంతాల్లో పదులకొద్దీ వచ్చాయి. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ గురువారం టంగుటూరు మండలం వల్లూరు సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ వచ్చిన అర్జీదారులతో మాట్లాడారు. జేసీలతో పాటు డిప్యూటీ కలెక్టర్లు, కందుకూరు సబ్‌కలెక్టర్‌, ఆర్డీవోలు పలుప్రాంతాల్లో సచివాలయాలను పరిశీలించారు. మరోవైపు తహసీల్దార్లు ఆయా ప్రాంతాల్లోని సచివాలయాలను సందర్శించి స్పందనను పర్యవేక్షించారు.

జిల్లావ్యాప్తంగా రెవెన్యూ స్పందనలో 4600 అర్జీలు
వల్లూరు సచివాలయంలో అర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

వల్లూరు, టంగుటూరు సచివాలయాలను పరిశీలించిన కలెక్టర్‌

జేసీలు, ఆర్డీవోలు, ఇతర అధికారుల పరిశీలన

 ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 21 : జిల్లాలో భూసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన రెవెన్యూ స్పందన గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అర్జీలను స్వీకరించారు. కొన్ని ప్రాంతాల్లోని సచివాలయాల్లో అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు పెద్దగా రాకపోగా కొన్నిప్రాంతాల్లో పదులకొద్దీ వచ్చాయి. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ గురువారం టంగుటూరు మండలం వల్లూరు సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ వచ్చిన అర్జీదారులతో మాట్లాడారు. జేసీలతో పాటు డిప్యూటీ కలెక్టర్లు, కందుకూరు సబ్‌కలెక్టర్‌, ఆర్డీవోలు పలుప్రాంతాల్లో సచివాలయాలను పరిశీలించారు. మరోవైపు తహసీల్దార్లు ఆయా ప్రాంతాల్లోని సచివాలయాలను సందర్శించి స్పందనను పర్యవేక్షించారు. కాగా కొన్ని సచివాలయాల్లో ఉదయం 11 గంటలకు కూడా అర్జీదారులు కనిపించలేదు. ఒంగోలు డివిజన్‌లో 1360, కందుకూరు డివిజన్‌లో 1871, మార్కాపురం డివిజన్‌లో 1361 అర్జీలు రాగా మొత్తం 4,600 వచ్చినట్లు అధికారులు తెలిపారు. సచివాలయాల్లో వచ్చిన అర్జీలను స్పందన పోర్టల్‌లో నమోదు చేసి మూడు నుంచి నాలుగు నెలల్లో పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.  

Updated Date - 2021-10-22T05:07:53+05:30 IST