లాక్‌డౌన్ అతిక్రమణ.. 4600 మంది నుంచి రూ.3.5 కోట్లు వసూలు

ABN , First Publish Date - 2020-06-01T23:23:20+05:30 IST

లాక్‌డౌన్ అమలులో ఉన్న ఈ రెండు నెలల కాలంలో నిబంధనలను అతిక్రమించినందుకు గానూ అనేకమందిని...

లాక్‌డౌన్ అతిక్రమణ.. 4600 మంది నుంచి రూ.3.5 కోట్లు వసూలు

దిస్‌పూర్: లాక్‌డౌన్ అమలులో ఉన్న ఈ రెండు నెలల కాలంలో నిబంధనలను అతిక్రమించినందుకు గానూ అనేకమందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి అపరాధ రుసుమును వసూలు చేశారు. దీనికి సంబంధించి తమ రాష్ట్రంలోని వివరాలను అస్సాం ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించినందుకు గానూ 4,600 మందిని అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.3.53 కోట్లను అపరాధ రుసుముగా వసూలు చేసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,208 ఘటనల్లో నిబంధనల అతిక్రమణ జరిగిందని, దీనికి సంబంధించి 2,679 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇదిలా ఉంటే అపరాధ రుసుంగా వసూలు చేసిన రూ.3.53 కోట్లలో రూ.3.17 కోట్లు వాహనదారుల నుంచే వసూలైనట్లు వెల్లడించారు.

Updated Date - 2020-06-01T23:23:20+05:30 IST