మండే ఎట్‌దరేట్‌ఆఫ్‌ 48

ABN , First Publish Date - 2020-07-14T11:13:09+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 48మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది.

మండే ఎట్‌దరేట్‌ఆఫ్‌ 48

 ఇరుజిల్లాల్లో కరోనా విజృంభణ

 ఒక్కరోజే 48మందికి నిర్ధారణ 

 ఖమ్మం జిల్లాలో 38, భద్రాద్రిలో 10మందికి పాజిటివ్‌ 


ఖమ్మంసంక్షేమవిభాగం/కొత్తగూడెం, జూలై 13: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 48మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. అయితే వీరిలో ఖమ్మం జిల్లాలో 38మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పది మంది ఉన్నారు.. ఖమ్మం నగరంలోని ముస్తాఫానగర్‌లో ఇద్దరు, ఆర్టీవో కార్యాలయ సమీపంలో ఒకరు, మమతారోడ్డులో ఐదుగురు, వీడివోస్‌ కాలనీలో ఒకరు, వెంకటేశ్వరనగర్‌లో ఒకరు, వైఎస్‌ఆర్‌ నగర్‌లో ఒకరు, నెహ్రూ నగర్‌లో ఒకరు, మమత జనరల్‌ ఆసుపత్రిలో ఒకరు, కరుణగిరి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒకరు, ముదిగొండ మండలం పెద్దమండవ, గోకినపల్లి, పమ్మి గ్రామాల్లో ఒక్కొక్కరు చొప్పున, నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురంలో ఒకరు, తల్లాడ మండలం కృష్ణాపురంలో ఒకరు, చింతకాని మండలం బస్వాపురంలో ఒకరు ,గాంధీనగర్‌లో ఇకరు కొవిడ్‌ బారిన పడ్డారు. వీరితో పాటు ఖమ్మంలో పనిచేసే ఓ దిన పత్రి క ఉద్యోగి, జిల్లా ఆసుపత్రి ల్యాబ్‌లో పని చేసే ఇద్దరు ఉద్యోగులు, ఇద్దరు శిక్షణ విద్యార్థులకు, ఖమ్మం ఖిల్లాలోని ఒక మహిళతో పాటు మరో 11 మందికి పాజిటివ్‌ నిర్దారణ అయింది.


 భద్రాద్రి జిల్లాలో 10 మందికి.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం మరో 10 మందికి పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. వీటిలో కొత్తగూడెంలోని శ్రీనివాసనగర్‌ కాలనీలో ఒకటి, పాత కొత్తగూడెంలోని పెనుబల్లిలో మరో కేసు నమోదైంది. పాల్వంచ పట్టణంలో హమాలీ కాలనీ, అంబేద్కర్‌ సెంటర్‌, రామాలయం ఏరియాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. దాంతో ఆయా ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంట్‌ చేశారు. మునిసిపల్‌ అధికారులు, వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను శానిటైజ్‌ చేశారు. మణుగూరు పట్టణంలో ఓ ప్రైవేటు విద్యా సంస్థ యజమానికి కరోనా పాజిటీవ్‌ వచ్చిందని, అది మైల్డ్‌స్థాయిలో ఉందని సోమవారం మణుగూరు వైద్యాధికారులు వెల్లడించారు.


సదరు పాఠశాల యజమాని జూన్‌ 25న వరంగల్‌ వెళ్లి 28న మణుగూరు వచ్చాడని, ఐదు రోజుల అనంతరం జూలై 4వ తేదీనుంచి దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడం కొంత ఇబ్బంది కలగడంతో హైదరబాద్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ తేలిందని వైద్యులు పేర్కొంటున్నారు. సదరు వ్యక్తికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు కొత్తగూడె పాల్వంచ పరిధిలో మరో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్రవైద్యశాఖ సోమవారం రాత్రి వెల్లడించిన హెల్త్‌ బులిటెన్‌తో తెలిపింది.

Updated Date - 2020-07-14T11:13:09+05:30 IST