Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉపాధి హామీ పధకం పనులపై హైకోర్టులో 497 పిటిషన్లు

అమరావతి: ఉపాధి హామీ పధకం పనులపై ఏపీ హైకోర్టులో 497 పిటీషన్లు దాఖలయ్యాయి. అన్ని కేసులలో విజిలెన్స్ విచారణ వేశామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అన్ని కేసులలో విజిలెన్స్ విచారణ వేయలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్పారు. 100 పిటిషన్ల విషయంలో డబ్బులు చెల్లించామని న్యాయస్థానం దృష్టికి ప్రభుత్వ న్యాయవాది తెచ్చారు. ఏ కేసులో ఎంత డబ్బు చెల్లించారని, ఇంకా ఎంత పెండింగ్‌లో ఉందో... మంగళవారం వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయినా పిటిషన్లలో 20శాతం మినహాయించి బిల్లులు చెల్లిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను రేపటికి న్యాయస్థానం వాయిదా వేసింది. 

Advertisement
Advertisement