Advertisement
Advertisement
Abn logo
Advertisement

5 గంటలు.. 50 పాటలు.. Telugu Book of Records లో స్థానం

 హైదరాబాద్ సిటీ/మల్కాజిగిరి : ఐదు గంటలు ఏకధాటిగా 50 పాటలు ఆలపించారు గాయకుడు కేవీ శివరామకృష్ణన్‌. దీంతో తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు. శివరామకృష్ణన్‌ చాణుక్యపురిలోని సమతాగోపాల్‌ కళాప్రాంగణంలో ఆదివారం రాత్రి 5 గంటలపాటు నిర్విరామంగా  ప్రముఖ హిందీ గాయకుడు కిశోర్‌కుమార్‌ ఆలపించిన 50 పాటలు పుస్తకం, లిరిక్స్‌ లేకుండా పాడారు. దీంతో తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ డి. వెంకటాచారి రికార్డు ధ్రువీకరణపత్రాన్ని ఆయనకు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా గాయకుడు శ్రీనివాస్‌రావు, సుజాత, చాంద్‌పాషా, కళాబందు గోపాల్‌యాదవ్‌, విశ్రాంత జడ్జి మధుసూదన్‌, పేరడి గురుస్వామి, సూర్యనారాయణ వ్యవహరించారు.

Advertisement
Advertisement