పోలీసులకు ముస్లింలకు మధ్య ఘర్షణ.. ఐదుగురు మృతి

ABN , First Publish Date - 2021-10-28T03:52:40+05:30 IST

వీరంతా బుధవారం బురద్కే నుంచి గుజ్రన్‌వాలా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతే కాకుండా టీఎల్‌పీ డిమాండ్లను పట్టించుకోమని ప్రభుత్వం ప్రకటించింది. టీఎల్‌పీ వ్యవస్థాపకుడు ఖాదిమ్ రిజ్వీ కుమారుడు సాద్ రిజ్విని పబ్లిక్ ఆర్డర్ (ఎంపీఓ) ఏప్రిల్‌లో అరెస్ట్ చేశారు. దీనిని ఆర్ఐపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది..

పోలీసులకు ముస్లింలకు మధ్య ఘర్షణ.. ఐదుగురు మృతి

ఇస్లామాబాద్: రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ (ఆర్ఐపీ) అనుచరులకు పోలీసులకు మధ్య బుధవారం జరగిన ఘర్షణలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు మరణించారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో నెలకొన్న ఈ ఘర్షణతో దేశవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ చీఫ్ సాద్ రిజ్వి విడుదలతో పాటు, ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ చేసిన డిమాండ్‌ను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ ప్రభుత్వం తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ (టిఎల్‌పి)కు చెందిన 10,000 మంది మద్దతుదారులను నిషేధిత జాబితాలోకి చేర్చింది. వీరంతా బుధవారం బురద్కే నుంచి గుజ్రన్‌వాలా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతే కాకుండా టీఎల్‌పీ డిమాండ్లను పట్టించుకోమని ప్రభుత్వం ప్రకటించింది. టీఎల్‌పీ వ్యవస్థాపకుడు ఖాదిమ్ రిజ్వీ కుమారుడు సాద్ రిజ్విని పబ్లిక్ ఆర్డర్ (ఎంపీఓ) ఏప్రిల్‌లో అరెస్ట్ చేశారు. దీనిని ఆర్ఐపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Updated Date - 2021-10-28T03:52:40+05:30 IST