5 వేల గిరిజన కుటుంబాల పునరావాసానికి ఏం చర్యలు తీసుకున్నారు?

ABN , First Publish Date - 2022-01-24T08:54:59+05:30 IST

మావోయిస్టు ప్రభావం కారణంగా ఛత్తీ స్‌గఢ్‌కు ఆనుకుని ఉన్న రాష్ట్రాల సరిహద్దుల్లో నివసిస్తున్న 5వేల గిరిజన కుటుంబాల పునరావాసంపై ఎలాంటి చర్యలు...

5 వేల గిరిజన కుటుంబాల   పునరావాసానికి ఏం చర్యలు తీసుకున్నారు?

ఏపీ, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు జాతీయ ఎస్టీ కమిషన్‌ నోటీసులు

హైదరాబాద్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు ప్రభావం కారణంగా ఛత్తీ స్‌గఢ్‌కు ఆనుకుని ఉన్న రాష్ట్రాల సరిహద్దుల్లో నివసిస్తున్న 5వేల గిరిజన కుటుంబాల పునరావాసంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిసా, మహారాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది. ఈ మేరకు ఐదు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లోని బస్తర్‌ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన కుటుంబాల దుస్థితిపై రాయ్‌పూర్‌కు చెందిన శుభరాన్షు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్‌ గిరిజన కుటుంబాల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై ఫిబ్రవరి 12లోగా లిఖితపూర్వకంగా లేదా వ్యక్తిగతంగా, ఇతర మాధ్యమం ద్వారా వివరాలు వెల్లడించాలని ప్రధాన కార్యదర్శుల్ని ఆదేశించారు. 

Updated Date - 2022-01-24T08:54:59+05:30 IST