50 కుటుంబాలు టీడీపీలో చేరిక

ABN , First Publish Date - 2022-01-18T05:40:01+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలు సమాజానికి మంచిదికాదని గుర్తించే గ్రామాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి పమిడి రమేష్‌ అన్నారు. మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ వల్లపునేని వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ వడ్లమూడి చెన్నయ్యల నేతృత్వంలో పంచాయతీ పరిధిలోని 50 కుటుంబాలకు చెందిన 100 మంది వైసీపీకి చెందిన కార్యకర్తలు స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

50 కుటుంబాలు టీడీపీలో చేరిక
టీడీపీలో చేరిన మల్లంపేట పంచాయతీకి చెందిన వైసీపీ కార్యకర్తలు

దొనకొండ, జనవరి 17 : వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలు సమాజానికి మంచిదికాదని గుర్తించే గ్రామాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి పమిడి రమేష్‌ అన్నారు. మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ వల్లపునేని వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ వడ్లమూడి చెన్నయ్యల నేతృత్వంలో పంచాయతీ పరిధిలోని 50 కుటుంబాలకు చెందిన 100 మంది వైసీపీకి చెందిన కార్యకర్తలు స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా పమిడి రమేష్‌ మాట్లాడుతూ వైపీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. టీడీపీకి చెందిన ప్రతి కార్యకర్త చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవరకు బాధ్యతగా పనిచేస్తూ ముందుకు సాగాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ పులిమి రమణాయాదవ్‌, టీడీపీ నాయకులు కొమ్మతోటి సుబ్బారావు, పత్తి వెంకటేశ్వర్లు, వల్లపునేని వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-18T05:40:01+05:30 IST