ఆశావర్కర్‌ కుటుంబానికి 50 లక్షలు

ABN , First Publish Date - 2021-01-26T08:56:15+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అనారోగ్య కారణాలతో మృతిచెందిన ఆశావర్కర్‌ బొక్కా విజయలక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

ఆశావర్కర్‌ కుటుంబానికి  50 లక్షలు

కుటుంబసభ్యులకు మంత్రులు సుచరిత, నాని పరామర్శ

తాడేపల్లి, జనవరి 25: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అనారోగ్య కారణాలతో మృతిచెందిన ఆశావర్కర్‌ బొక్కా విజయలక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆశావర్కర్‌గా 15 ఏళ్లు సేవలందించిన ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ (నాని), హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సోమవారం వారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి విచ్చేశారు. కరోనా విధుల్లో భాగంగా చనిపోయిన ఆరోగ్య సిబ్బందికే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందని, కానీ.. విజయలక్ష్మి కటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.50 లక్షలు తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రి నాని తెలిపారు. అలాగే కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు వచ్చేవిధంగా సీఎం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. కాగా, కరోనా వ్యాక్సిన్‌ కోసం రిజిష్టరు చేసుకున్నవారు అపోహ పడాల్సిన పనిలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. వ్యాక్సిన్‌ తీసుకునేవారు ముందుగా వైద్యులు, నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2021-01-26T08:56:15+05:30 IST