ఆర్యోగ్యశ్రీ కింద 50 శాతం బెడ్లు

ABN , First Publish Date - 2021-05-08T04:57:27+05:30 IST

జిల్లాలో ప్రభుత్వం అనుమతిచ్చిన కొవిడ్‌ వైద్యశాలల్లోని బెడ్లలో 50 శాతం ఆర్యోగ్యశ్రీ ద్వారా వచ్చే పాజిటివ్‌ బాధితులకే కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు.

ఆర్యోగ్యశ్రీ కింద 50 శాతం బెడ్లు
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

2 కరుణానిధి 7 : సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

మిగిలిన కరోనా బాధితులకు తర్వాతే

 లేకపోతే చికిత్సకు అనుమతి రద్దు

జేసీలు, నోడల్‌ అధికారుల సమీక్షలో కలెక్టర్‌

నెల్లూరు(హరనాథపురం), మే 7 : జిల్లాలో ప్రభుత్వం అనుమతిచ్చిన కొవిడ్‌ వైద్యశాలల్లోని బెడ్లలో 50 శాతం ఆర్యోగ్యశ్రీ ద్వారా వచ్చే పాజిటివ్‌  బాధితులకే కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో శుక్రవారం ఆయన జేసీలు, నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే బాధితులకు బెడ్లు ఇచ్చాకే మిగతా వారికి ఇవ్వాలన్నారు. అలా చేయకపోతే నోటిఫైడ్‌ వైద్యశాలల్లో కొవిడ్‌ చికిత్స  చేయడానికి అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు.  పేదల నుంచి ఒక్కపైసాకూడా వసూలు చేయకూడదనీ, నాన్‌ కొవిడ్‌ వైద్యశాలల్లో చికిత్స అందించరాదనీ అన్నారు.  వైద్యశాలల్లో బెడ్ల కేటాయింపు, మందుల సరఫరా, రోగులకు చికిత్స అందించడంలో దళారుల ప్రమేయం ఉండకూడదన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్ల అక్రమ తరలింపును గుర్తించి అరికట్టాలన్నారు. ప్రజలు 104, 108 వాహనాలకు కాల్‌ చేయగానే వెంటనే సహాయం అందించాలని ఆదేశించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు బయట తిరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  సమావేశంలో జేసీలు హరేందిరప్రసాద్‌, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-05-08T04:57:27+05:30 IST