500 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-07T05:38:31+05:30 IST

పేద ప్రజల కోసం ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తమ వ్యాపార స్వలాభం కోసం పేదల పొట్టకొడుతున్నారు. ఇలాంటి సంఘటనే మండలంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజమున 2.30 గంటల సమయంలో రాయచోటి నుంచి మదనపల్లెకు 500 బస్తాల రేషన్‌ బియ్యంతో ఏపీటీయూ 4775 గల లారీ వెళ్తుండగా రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 9 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకొన్నారు.

500 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం
పోలీ్‌సస్టేషన్‌ వద్ద ఉన్న బియ్యం లారీ

చిన్నమండెం, డిసెంబరు 6: పేద ప్రజల కోసం ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తమ వ్యాపార స్వలాభం కోసం పేదల పొట్టకొడుతున్నారు. ఇలాంటి సంఘటనే మండలంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజమున 2.30 గంటల సమయంలో రాయచోటి నుంచి మదనపల్లెకు 500 బస్తాల రేషన్‌ బియ్యంతో ఏపీటీయూ 4775 గల లారీ వెళ్తుండగా రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 9 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకొన్నారు. రాయచోటికి చెందిన గౌస్‌, లారీడ్రైవర్‌ భాస్కర్‌లపై ఫిర్యాదు చేయగా, వీరిపై 420 ఆర్‌డబ్ల్యు, 341 ఐపీసీ, సెక్షన్‌ 7(1) ఈసీ యాక్ట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-12-07T05:38:31+05:30 IST