కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి క్రికెట్ మ్యాచ్.. 51 మందిపై కేసు నమోదు..

ABN , First Publish Date - 2020-07-05T05:13:13+05:30 IST

ఇవాళ కొందరు కొవిడ్-19 మార్గదర్శకాలకు విరుద్ధంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడంపై పోలీసులు 51 మందిపై కేసులు..

కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి క్రికెట్ మ్యాచ్.. 51 మందిపై కేసు నమోదు..

నోయిడా: గ్రేటర్ నోయిడాలో కొవిడ్-19 మార్గదర్శకాలకు విరుద్ధంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడంపై పోలీసులు 51 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌కు వచ్చిన వాళ్లు ఉపయోగించిన 17 కార్లకు చెందిన యజమానులకు కూడా చలానాలు రాసినట్టు అధికారులు తెలిపారు. కేసు నమోదైన వారిలో ఢిల్లీకి చెందిన ఇద్దరు నిర్వాహకులు, పలువురు ప్రేక్షకులు ఉన్నారు. నిర్వాహకులను దీపక్ అగర్వాల్, నాజిక్ ఖురానాలుగా గుర్తించారు. ప్రేక్షకుల్లో పలువురు ఢిల్లీ నుంచి వచ్చిన వారని తేలింది. ‘‘ప్రస్తుతం కొవిడ్19 నిబంధనలు అమల్లో ఉన్నందున సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పని సరి అన్నది అందరికీ తెలుసు. నిర్వాహకులు ఎలాంటి అనుమతులూ లేకుండానే క్రికెట్ మ్యాచ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వారు కనీసం జాగ్రత్తలు కూడా పాటించినట్టు కనిపించలేదు. దీంతో ఐపీసీ 188, 269, 270 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం..’’ అని గ్రేటర్ నోయిడా డీసీపీ రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-05T05:13:13+05:30 IST