ఒక్కచేపతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన బామ్మ..!

ABN , First Publish Date - 2020-09-30T02:32:50+05:30 IST

చేపల వేటే జీవనాధారంగా బతుకీడుస్తున్న ఓ బామ్మ ఒక్క చేపతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యింది. పశ్చిమ బెంగాల్లోని...

ఒక్కచేపతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన బామ్మ..!

కోల్‌కతా: చేపల వేటే జీవనాధారంగా బతుకీడుస్తున్న ఓ నిరుపేద బామ్మ ఒక్క చేపతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యింది. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లా సుందర్బన్స్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాగర్ ఐలాండ్స్‌కి చెందిన పుష్పా కర్ అనే వృద్ధురాలు శనివారం చేపల వేటకు వెళ్లగా.. నదిలో భారీ చేప కొట్టుకెళ్తున్నట్టు ఆమెకు కనిపించింది. దీంతో ఒక్క ఉదుటున అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకుంది. కొందసేపు శ్రమించి అతి కష్టం మీద దానికి ఒడ్డుకు తీసుకుని వచ్చింది. స్థానికుల సాయంతో దాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లగా అది 52 కేజీలు ఉన్నట్టు తేలింది. కిలో రూ.6,200 అమ్ముడు పోవడంతో బామ్మకు రూ.3 లక్షలకు పైగా లభించాయి.


ఈ చేప నదిలో అటుగా వెళ్తున్న ఓ నావను ఢీకొట్టి చనిపోయినట్టు భావిస్తున్నారు. అయితే బామ్మకు దొరికే సమయానికి అది కొంతమేర పాడైపోవడంతో తక్కువ ధర పలికిందనీ.. ఇంకా కొంచెం ముందుగా దొరికి ఉంటే మరింత ధర వచ్చేదని స్థానికుడొకరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది తినేందుకు పనికిరాకపోయినప్పటికీ ఇతర అవసరాల కోసం దీన్ని వినియోగించనున్నారు. కొవ్వు సహా ఇతర అవయవాలను ఆగ్నేయ ఆసియాకి తరలించనున్నారు. ఎండిన కొవ్వు, ఫిష్ మా విలువ కిలో రూ 80 వేల వరకు ఉంటుంది. ఈ తరహా చేపలను ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కాగా ఈ చేప దొరకడం వల్ల తన ఆర్థిక కష్టాలన్నీ ఇక తీరిపోతాయని సదరు బామ్మ సంతోషం వ్యక్తం చేసింది.

Updated Date - 2020-09-30T02:32:50+05:30 IST