పంచాయతీ శాఖకు రూ.5,35,84,240 నిధులు మంజూరు

ABN , First Publish Date - 2022-01-24T05:22:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021-22 సంవత్సరానికి గాను జిల్లా పంచాయతీ శాఖకు రూ.5,35,84,240 నిధులు మంజూరయ్యాయని డీపీవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇందులో సర్పంచ్‌ల గౌరవ వేతనం కింద రూ.2,64,32,400 మంజూ రైందన్నారు. ఈ నిధుల నుంచి ఒక్కొక్క సర్పంచ్‌కు నెలకు రూ.3వేల చొప్పున 12 నెలల గౌరవ వేతనాన్ని ఇస్తామన్నారు.

పంచాయతీ శాఖకు రూ.5,35,84,240 నిధులు మంజూరు

కడప(రూరల్‌), జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021-22 సంవత్సరానికి గాను జిల్లా పంచాయతీ శాఖకు రూ.5,35,84,240 నిధులు మంజూరయ్యాయని డీపీవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇందులో సర్పంచ్‌ల గౌరవ వేతనం కింద రూ.2,64,32,400 మంజూ రైందన్నారు. ఈ నిధుల నుంచి ఒక్కొక్క సర్పంచ్‌కు నెలకు రూ.3వేల చొప్పున 12 నెలల గౌరవ వేతనాన్ని ఇస్తామన్నారు. అలాగే వృత్తి పన్ను (గ్రామాలలో పలు శాఖలలో పనిచేసే ఉద్యోగుల ద్వారా వసూలైన పన్ను) రూ.1,92,52,240లు, 4 రూపాయల తలసరి గ్రాంట్స్‌ కింద మొత్తం రూ.78,99,600 కేటాయించారన్నారు. ఈ నిధులన్నింటిని జనరల్‌ ఫండ్‌కు జమచేసి అక్కడి నుంచి జిల్లాలోని 807 గ్రామ పంచాయతీలకు దామాషా ప్రకారం కేటాయిస్తామన్నారు. ఈ నిధులను ఆయా గ్రామ పంచాయతీలలో శానిటేషన్‌, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, కరెంట్‌ బిల్లుల చెల్లింపులకు ఉపయోగిస్తారన్నారు.

Updated Date - 2022-01-24T05:22:02+05:30 IST