54 బ్యాంకు ఖాతాల్లో.. 55 కోట్లు ఫ్రీజ్‌

ABN , First Publish Date - 2021-06-06T12:46:47+05:30 IST

ఇన్‌స్టంట్‌ దారుణ దందా మోసాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

54 బ్యాంకు ఖాతాల్లో.. 55 కోట్లు ఫ్రీజ్‌

  • ఇన్‌స్టంట్‌ దా‘రుణ’ దందా నిందితులపై..
  • చార్జిషీట్‌ సిద్ధం చేయనున్న సైబరాబాద్‌ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ : ఇన్‌స్టంట్‌ రుణ దందా నిర్వహించి ఆన్‌లైన్‌లో వేధింపులకు గురిచేసిన వారిపై బాధితులు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. గతేడాది ట్రై కమిషనరేట్‌ పరిధిలో ఇన్‌స్టంట్‌ దారుణ దందా మోసాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీ అనుమతులు లేకుండా ఢిల్లీ, గుర్‌గావ్‌, బెంగళూర్‌, బిహార్‌, రాజస్థాన్‌, హైదరాబాద్‌లలో చట్టవ్యతిరేకంగా ఇన్‌స్టంట్‌ రుణ దందాలు నిర్వహిస్తున్న 26 కంపెనీలపై సైబరాబాద్‌ పోలీసులు దాడులు జరిపారు. 


ఫోన్‌లు చేసి బాతులను, బంధువులను దారుణంగా వేధించి ఇబ్బందులకు గురిచేసిన కాల్‌సెంటర్‌ నిర్వాహకులు, ఇన్‌స్టంట్‌ సంస్థల యాజమాన్యాలపై 13 కేసులు నమోదు చేశారు. మొత్తం 34 మందిని నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అనంతరం వారి రుణ దందాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివిధ బ్యాంకుల్లో ఉన్న 54 ఖాతాలను గుర్తించారు. అందులో ఉన్న సుమారు రూ.55కోట్లను ఫ్రీజ్‌ చేశారు. ఈ కేసులకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని సేకరించిన సైబర్‌ క్రైం పోలీసులు నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.

Updated Date - 2021-06-06T12:46:47+05:30 IST