50 శాతం కరోనా మృతులకు ఎటువంటి వ్యాధులు లేవు: ఐసీఎంఆర్

ABN , First Publish Date - 2020-10-24T15:29:36+05:30 IST

కరోనా వైరస్ దేశంలోని వృద్ధులు, ఇతర వ్యాధులతో సతమతమవుతున్నవారిని బలి తీసుకుంటోంది.

50 శాతం కరోనా మృతులకు ఎటువంటి వ్యాధులు లేవు: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశంలోని వృద్ధులు, ఇతర వ్యాధులతో సతమతమవుతున్నవారిని బలి తీసుకుంటోంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో చిన్నవయసువారికి కూడా కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందిన 54శాతం మందికి గతంలో ఎటువంటి వ్యాధులు లేవు. 


యూపీలో కరోనాతో మృతిచెందిన వారిలో 40శాతం మంది 30 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు ఉన్నారు. ఈ విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన భేటీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా అత్యధిక మరణాలు లక్నో, మీరఠ్, వారణాసి, కాన్పూర్, గోరఖ్‌పూర్‌లలో సంభవించాయి. కాగా యూపీలో కరోనా పీక్ స్టేజ్ దాటి, ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. అయితే కరోనా మృతుల విషయంలో జిల్లా వైద్యశాఖాధికారులు సమీక్షించాల్సివుంది. 


Updated Date - 2020-10-24T15:29:36+05:30 IST