Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.2,500కే 5జీ ఫోన్‌!?

 జియో విడుదల!


ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 44వ వార్షిక వాటాదారుల సమావేశం ఈనెల 24న జరగనుంది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో కలిసి జియో అభివృద్ధి చేస్తున్న చౌక 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏజీఎంలోనే విడెదల చేసే అవకాశం ఉంది. జియోబుక్‌ పేరుతో చౌక లాప్‌టా్‌పనూ విడుదల చేయనుందని సమాచారం. అంతేకాదు, జియో తన 5జీ సేవల ప్రారంభ షెడ్యూలును సైతం ప్రకటించవచ్చని తెలుస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.2,500 స్థాయిలో నిర్ణయించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


జియో మరింత జోరు: జియో మరిన్ని డిజిటల్‌ సేవల ప్రారంభాన్ని వేగవంతం చేయనుందని ఆర్‌ఐఎల్‌ వార్షిక నివేదిక పేర్కొంది. అంతేకాదు, జియో సొంతంగా 5జీ స్టాక్‌ను అభివృద్ధి చేసుకుందని తెలిపింది. మరో 30 కోట్ల మంది మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు, 5 కోట్లకు పైగా ఫైబర్‌ హోమ్స్‌, 5 కోట్ల ఎంఎ్‌సఎంఈలకు సేవలందించగలిగే స్థాయిలో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకోవడం జరిగిందని ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ నెట్‌వర్క్‌ టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్‌, జియో కలిసి భారత్‌లో 5జీ సొల్యూషన్స్‌ను విజయవంతంగా పరీక్షించడం జరిగిందన్నారు. జియో 5జీ సొల్యూషన్స్‌ ఇప్పటికే 1జీబీపీఎస్‌ డేటా వేగం మైలురాయిని అందుకోగలిగిందని ఆయన వెల్లడించారు.

 

దండిగా నగదు నిల్వలు..  

రికార్డు స్థాయి నిధుల సమీకరణతో కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌ బలోపేతమైందని అంబానీ అన్నారు. కంపెనీ వద్దనున్న భారీ నిల్వలు రిలయన్స్‌ జియో, రిటైల్‌, ఆయిల్‌ టు కెమికల్‌(ఓ2సీ) వ్యాపార విభాగాల భవిష్యత్‌ వృద్ధికి దన్నుగా నిలవనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.Advertisement
Advertisement