5న ‘ప్రజల వద్దకే వైద్యం’ ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-01T13:43:08+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన చికిత్సలు, మందులు పొందని మధుమేహం, రక్తపీడనంతో బాధపడుతున్న రోగులకు వరంలా రాష్ట్రంలో ప్రజల

5న ‘ప్రజల వద్దకే వైద్యం’ ప్రారంభం

               - బీపీ, షుగర్‌ రోగులకు చికిత్సలు, మందులు


చెన్నై: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన చికిత్సలు, మందులు పొందని మధుమేహం, రక్తపీడనంతో బాధపడుతున్న రోగులకు వరంలా రాష్ట్రంలో ప్రజల వద్దకే వైద్యం పేరు తో కొత్త పథకం అమలు కానుంది. ఆగస్టు ఐదున కృష్ణగరి జిల్లా సామనపల్లి గ్రామంలో ఈ కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంబించనున్నారు. ఆ గ్రామంలోని మర్రివృక్షం దిగువన గ్రామసభ తరహాలో ఏర్పాటయ్యే ప్రత్యేక సభలో ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకంలో భాగంగా మధుమేహంతో బాధపడు తున్నవారికి వారి ఇళ్ల వద్దే మినీ డయాలసిస్‌ యంత్రాల ద్వారా ఉచితంగా డయాలసిస్‌ కూడా నిర్వ హించనున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. అదే సమయంలో కీళ్లనొప్పులు, వెన్ను నొప్పులతో బాధపడుతున్నవారికి ఆరోగ్య సిబ్బంది ‘ఫిజియో థెరఫీ’ చికిత్సలు కూడా అందించనున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంబించిన తర్వాత తళి శాసనసభ నియోజక వర్గంలోని పెట్టములాయం అనే గిరిజన గ్రామ ప్రజల కోసం ఉచిత అంబులెన్‌ సదుపాయాన్ని కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. కృష్ణగిరి జిల్లాలో ప్రారంభయ్యే ఈ వినూత్న పథకం అన్ని జిల్లాల్లోనూ దశలవారీగా విస్తరింపజే యనున్నామని ఆయన పేర్కొన్నారు.


కరోనా నివారణ సహాయనిధికి రూ.500కోట్లు

కరోనా నిరోధక నివారణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇప్పటివరకూ రూ.500 కోట్లకు పైగా విరాళాలు అందాయి. గత మూడుమాసాలుపాటు ఈ నిధికి రూ.500కోట్లకు పైగా విరాళాలు అందాయని అధికారులు తెలిపారు. ఈనిధి నుంచి కరోనా నిరోధక పనులకు రూ.305కోట్లను ఖర్చుచేసినట్టు పేర్కొన్నారు.

Updated Date - 2021-08-01T13:43:08+05:30 IST