Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరేళ్ల వయసులోనే గిన్నిస్‌ రికార్డు!

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం కోసం కొందరు తమ జీవితకాలం మొత్తాన్ని వెచ్చిస్తారు. కానీ హాంకాంగ్‌కు చెందిన స్కార్లెట్‌ ఆష్లీ చెంగ్‌ అనే బాలిక ఆరేళ్ల వయసులోనే గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించింది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసిందో తెలుసా?

 స్కార్లెట్‌ వయస్సు ఆరేళ్లు. ఆమె ఎనిమిదేళ్ల తన సోదరితో కలిసి లిప్‌బామ్‌లు సేకరించడం హాబీగా పెట్టుకుంది. అలా 3,388 రకాల లిమ్‌బామ్‌లు సేకరించింది. ఆమె సేకరణకు ప్రపంచంలోనే లార్జెస్ట్‌ లిప్‌ బామ్‌ కలెక్షన్‌గా పేరొచ్చింది. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు సైతం వారి దగ్గర ఉన్న లిప్‌బామ్‌లను చూసి ఆశ్చర్యపోయారు. 

 స్కార్లెట్‌ సేకరించిన లిప్‌బామ్‌లలో రకరకాల రంగులు, టెక్చర్స్‌, షేపుల్లో ఉన్నవి ఉన్నాయి. ఇక బ్రాండ్‌ల సంగతి చెప్పనక్కర్లేదు. కొన్ని లిప్‌బామ్‌లను స్నేహితులు సేకరించి గిఫ్ట్‌గా ఇచ్చారు. 

 ‘‘రోజూ మా నానమ్మ, అమ్మ నాకు లిప్‌బామ్‌ పెట్టేవారు. మొదట్లో ఎలాంటి ఫ్లేవర్‌ లేనిది వాడేవారు. నేను కొద్దిగా పెద్దయ్యాక రకరకాల ఫ్లేవర్స్‌ ఉన్నవి ఉపయోగించడం మొదలుపెట్టాను. ఆ తరువాత వాటిని సేకరించడం హాబీగా పెట్టుకున్నాను’’ అని అంటుంది స్కార్లెట్‌. చిన్న వయసులోనే గిన్నిస్‌ బుక్‌లో ఎక్కడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అంటోంది స్కార్లెట్‌. 

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...