రాజస్థాన్‌లో 60కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-03-30T20:33:22+05:30 IST

రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60కి చేరింది. బిల్వారా జిల్లాలో గరిష్టంగా 25 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ ..

రాజస్థాన్‌లో 60కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

జైపూర్: రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60కి చేరింది. బిల్వారా జిల్లాలో గరిష్టంగా 25 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, జోథపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తక్కువ నాణ్యతా ప్రమాణాలు కలిగిన పెర్సనల్ ప్రొటక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు ఇస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. తక్కువ నాణ్యతా ప్రమాణాలు కలిగిన కిట్లు కొనుగోలు చేయాలని ఎవరూ అనుకోరని, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ప్రభుత్వం సహించేది లేదని అన్నారు.


దేశంలో 1071 కేసులు..మృతులు 29

కాగా, దేశవ్యాప్తంగా సోమవారంనాడు కొత్తగా నమోదైన 47 కేసులలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరిలో 99 మందికి స్వస్థత చేకూరడంతో డిశ్చార్చి చేసినట్టు చెప్పింది. కరోనా మృతుల సంఖ్య 29కి చేరినట్టు తెలిపింది.

Updated Date - 2020-03-30T20:33:22+05:30 IST