60 మందికి టైఫాయిడ్‌, డెంగ్యూ

ABN , First Publish Date - 2021-06-24T09:37:10+05:30 IST

భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కాలనీలో 10 రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి.

60 మందికి టైఫాయిడ్‌, డెంగ్యూ

భద్రాద్రి జిల్లా నారాయణపురంలో భయం భయం

అశ్వారావుపేట రూరల్‌, జూన్‌ 23: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కాలనీలో 10 రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. 60 మందికిపైగా టైఫాయిడ్‌, డెంగ్యూతో బాధపడుతున్నారు. బాధితులంతా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, పాల్వంచలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన టి.కృష్ణ(30), రాంబాబు(35) కామెర్లు, జ్వరం, ఇతర లక్షణాలతో మృతిచెందడంతో గ్రామస్థుల్లో భయం మొదలైంది. అయితే కాలనీలో జ్వరాలు ప్రబలడానికి కలుషిత నీరే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలనీలో మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లందించే ట్యాంకు లోపల దాదాపు అడుగు మేర బురద పేరుకుపోయింది. దీంతో దుర్వాసనతో కూడిన నీరు వస్తోంది. దీనికితోడు భగీరధ పైపులైన్లకు పలుచోట్ల లీకేజీలు ఉండటంతో ఇళ్లకు దాదాపు కలుషిత నీరు సరఫరా అవుతుందని కాలనీవాసులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాలనీలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-06-24T09:37:10+05:30 IST