60 వేల మెజారిటీతో కేకే శైలజ ఘన విజయం

ABN , First Publish Date - 2021-05-02T22:34:19+05:30 IST

ఇక కేరళలో లెఫ్ట్ పార్టీల కూటమైన ఎల్‌డీఎఫ్ అధికారంలోకి రానున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.

60 వేల మెజారిటీతో కేకే శైలజ ఘన విజయం

తిరువనంతపురం: కేరళ ఆరోగ్య మంత్రి, సీపీఎం అభ్యర్థి కేకే శైలజ ఘన విజయం సాధించారు. లెఫ్ట్‌కు బాగా పట్టున్న కన్నూరు జిల్లాలోని మట్టన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. కాగా కేరళలో ఇంత పెద్ద భారీ మెజారిటీతో గెలిచిన అతి కొద్ది మందిలో శైలజ ఒకరు అని అంటున్నారు. కాగా, ఆరోగ్య మంత్రిగా ఆమె పనితీరు పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పని మరికొందరు అంటున్నారు.


ఇక కేరళలో లెఫ్ట్ పార్టీల కూటమైన ఎల్‌డీఎఫ్ అధికారంలోకి రానున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. లెక్కింపు చివరి వరకు ఇదే ధోరణి కొనసాగితే కేరళలో వరుసగా రెండోసారి లెఫ్ట్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది.

Updated Date - 2021-05-02T22:34:19+05:30 IST