Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారీగా వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ చేసిన కువైట్ !

6 నెలల్లో 62వేల వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ 

కువైట్ సిటీ: కువైటైజేషన్ వైపు గల్ఫ్ దేశం కువైట్ చకచక అడుగులేస్తోంది. దీనిలో భాగంగా తమ దేశంలోని ప్రవాస కార్మికులను తగ్గించుకునే పనిలో ఉంది. గడిచిన 6 నెలల్లో సుమారు 62వేల మంది ప్రవాసుల వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ చేసింది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ తెలియజేసింది. తాజాగా వెలువడిన డేటా ప్రకారం జనవరి 10 నుంచి జూన్ 30 వరకు ఏకంగా 61,975 వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వీటిలో 38,873 మంది ప్రవాసులు తమ వర్క్ పర్మిట్లను రెన్యువ్ చేసుకోకపోవడంతో రద్దు అయ్యాయి. మిగతావి ఫ్యామిలీ రెసిడెన్సీ ట్రాన్స్‌ఫర్, మరణాల కారణంగా క్యాన్సిల్ అయినట్లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ పేర్కొంది.         

Advertisement
Advertisement