6.5 లక్షలు దాటేశాయ్‌

ABN , First Publish Date - 2020-09-25T08:50:38+05:30 IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి. గురువారం కొత్తగా 7,855

6.5 లక్షలు  దాటేశాయ్‌

రాష్ట్రంలో మరో 7,855 పాజిటివ్‌లు

కొత్తగా కరోనాతో 52 మంది మృతి

ఇప్పటి వరకూ 5,558 మరణాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి. గురువారం కొత్తగా 7,855 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,54,385కి పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదవగా.. ప్రకాశంలో 927 కేసులు బయటపడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8,807 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.


రాష్ట్రంలో మరో 52 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. చిత్తూరులో 8, అనంతపురంలో 6, గుంటూరులో 6, కృష్ణాలో 5, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 5, తూర్పుగోదావరిలో 4, కడపలో 3, కర్నూలులో 3, పశ్చిమగోదావరిలో 3, విజయనగరంలో 2, నెల్లూరు, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,558కి చేరుకుంది.  


‘పశ్చిమ’లో కల్లోలం

పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం మరో 1,328 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 67,142కి చేరింది. వారిలో 54,640 మంది కోలుకోగా.. 431 మంది మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 1,095 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసులు 91,142కి పెరిగాయి. జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 501కి చేరుకుంది. అనంతపురం జిల్లాలో మరో 497 కేసులు బయటపడడంతో బాధితుల సంఖ్య 54,760కు చేరింది.


కర్నూలు జిల్లాలో కొత్తగా 325 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 55,045కి, మరణాలు 456కి చేరుకున్నాయి. గుంటూరు జిల్లాలో 551మందికి కొత్తగా వైరస్‌ సోకింది. నెల్లూరు జిల్లాలో మరో 405 కేసులు నమోదవగా బాధితుల సంఖ్య 51,134కి పెరిగింది. విశాఖ జిల్లాలో మరో 425 కేసులు బయటపడగా బాధితుల సంఖ్య 48,761కి చేరుకుంది. విజయనగరం జిల్లాలో.. 384, శ్రీకాకుళంలో 461 కేసులు నిర్ధారణ అయ్యాయి. కడప జిల్లాలో 24 గంటల వ్యవధిలో 545 కేసులు బయటపడ్డాయి..కృష్ణా జిల్లాలో కొత్తగా 346 మందికి వైరస్‌ సోకింది. 



శతాధిక వృద్ధురాలు కరోనాను జయించెన్‌


కరోనాను చూసి యువకులు సైతం హైరానా పడిపోతు న్న వేళ.. శతాధిక వృద్ధురాలు కొవిడ్‌ను జయించింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన కన్నారపు వీరరాఘవమ్మకు కరోనా సోకడంతో ఆగస్టు 31న కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఇంత వయసులోనూ కరోనాకు భయపడకుండా చికిత్స తీసుకున్నారు.


తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఆమెను గురువారం డిశ్చార్జి చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. రాఘవమ్మ 1895లో జన్మించారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.



మాస్కే ఆయుధం...

వైరస్‌ నివారణ, నియంత్రణకు మాస్కులే ఆయుధమని కరోనా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అధికారి డా.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. టీకా కోసం వేచి చూడవద్దని.. మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతికదూరం పాటించడం వంటివి కరోనాపై పోరాటానికి ఆయుధాలని చెప్పారు. 


Updated Date - 2020-09-25T08:50:38+05:30 IST